నేటిసాక్షి, నల్లగొండ : మహాత్మా గాంధీ యూనివర్సిటీ నూతనంగా రిజిస్ట్రార్ గా బాధ్యతలు చేపట్టిన డా. ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి ని మహాత్మా గాంధీ యూనివర్సిటీలోని వివిధ విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు శనివారం కలిసి శాలువాతో సత్కరించి, వారికి శుభాకాంక్షలు తెలుయజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యూనివర్సిటీ ని రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక గొప్ప పేరుగాంచిన యూనివర్సిటీగా నిలపాలని, విద్యార్థి సంఘాల నాయకులు వారిని కోరారు. ఈ కార్యక్రమంలో స్వేరో స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనుముల సురేష్ స్వేరో, ఎంఎస్ఎఫ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ అధ్యక్షులు మాచర్ల సుధీర్ మాదిగ, పిడిఎస్ యూ యూనివర్సిటీ అధ్యక్షులు హర్ష, బీఆర్ఎస్వి అధ్యక్షులు వాడపల్లి నవీన్, టిఆర్ఎస్వీ అధ్యక్షులు పాకరవి, డిఎస్ యూ అధ్యక్షులు నిర్సనమెట్ల సుధీర్ మహారాజ్, మరియు నాయకులు సతీష్, శివ, నరసింహ తదితర విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు.





