నేటి సాక్షి,నారాయణపేట, మార్చి 22, (రిపోర్టర్ ఇమామ్ సాబ్), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోని మరికల్ రిషి హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా “వెల్ బేబీ షో” – ఆరోగ్య అవగాహనకు కొత్త దారులుమరికల్‌లోని రిషి హై స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన “వెల్ బేబీ షో” కార్యక్రమం ఘనంగా జరిగింది. చిన్నారుల ఆరోగ్యం, అభివృద్ధి మరియు తల్లిదండ్రులలో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌కు చెందిన రవి చిల్డ్రన్స్ వైద్య బృందం పాల్గొని చిన్నారుల ఎత్తు, బరువు తదితర అంశాలను పరీక్షిస్తూ ప్రత్యేక హెల్త్ క్యాంపును నిర్వహించారు. తల్లిదండ్రులకు పిల్లల పెరుగుదల, పోషణ, ఆరోగ్య సంరక్షణపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.చిన్నారుల కోసం ఆక్టివిటీ ఆధారిత గేమ్స్ నిర్వహించగా, పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో “ఓరల్ చాంపియన్” గా ఎంపికైన విజేతకు రూ.5000 నగదు బహుమతి అందజేయడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ కార్యక్రమంలో రిషి హై స్కూల్ ప్రిన్సిపల్ సుజిష్ కరెస్పాండెంట్ రమేష్ శెట్టి గారు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు, రవి చిల్డ్రన్స్ నిర్వాహకులు డాక్టర్ వంశీ మరియు వారి వైద్య బృందం పాల్గొని చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.ముఖ్య అతిథులుగా మరికల్ శ్రీనివాసులు , అనిత మేడం పాల్గొని పోటీల్లో విజేతలుగా నిలిచిన చిన్నారులకు బహుమతులు అందజేసి అభినందించారు. అదేవిధంగా రిషి హై స్కూల్ ఉపాధ్యాయులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు.ఈ “వెల్ బేబీ షో” కార్యక్రమం ద్వారా చిన్నారుల ఆరోగ్యంపై తల్లిదండ్రుల్లో అవగాహన పెరిగిందని, ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని స్థానికులు అభిప్రాయపడ్డారు.





