నేటి సాక్షి, బిజినెస్ డెస్క్: అమ్మో.. పది రూపాయాల కాయినా? మాకొద్దు.. ఇది చెల్లడం లేదు.. వేరేవి ఉంటే ఇయ్యండి.. లేదా ఇవి మాత్రం మాకు వద్దు.. అని కరాఖండి తేల్చి చెబుతున్నారు షాపుల నిర్వాహకులు, వ్యాపారులు. దీంతో మనకు ఏమి పాలుపోక, జేబులోంచి తీసిన కాయిన్ను మళ్లీ జేబులో పెట్టుకొని, వేరే పైసలు ఇచ్చి, తర్వాత మనం మథన పడుతున్నాం. నేను అనవసరంగా వేరే వారి నుంచి తీసుకున్నాను కదా. ఇక నాకు రూ.10 లాస్ అని లోలోన కుమిలిపోతున్నాం.
అయితే, అసలు పది రూపాయల కాయిన్ రద్దు అయ్యిందా? అంటే అదీ లేదు. ఆర్బీఐ కూడా ఎక్కడా ప్రకటించలేదు. రూ.10 కాయిన్ తీసుకోకపోవడానికి అసలు కారణం వాట్సాప్ ఫేక్ న్యూస్లు. వదంతులు నమ్మి, నిజంగా ఇది చెల్లదని అనుకుంటున్నారు. ఇలా నిరాకరించడం వల్ల దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన కాయిన్స్ బ్యాంకుల్లో మూలుగుతున్నాయి. మన ఆర్థిక మాంధ్యానికి ఇది కూడా ఒక కారణం అవుతున్నది. దురదృష్టవశాత్తూ మనం వదంతులు వందుతులు నమ్మి, ఇదేదో చెల్లదని అనుకుంటున్నాయం. ఆర్బీఐ కూడా ఎక్కడా దీనిని నిషేధించలేదు. దీనిని మనం నిక్షేపంలా మనం వాడుకలో పెట్టుకోవచ్చు. ఇది మనం తీసుకోవాలి.. ఇవ్వాలి కూడా. సో.. మనం బాధ్యత గల పౌరుడిగా, మనం చేయాల్సింది ఏమిటంటే, దీనిని మనం తీసుకోవాలి.. ఇవ్వాలి.. ఏ కారణం చేత తీసుకోకపోతే ఎవరైనా తీసుకోకపోతే పోలీసులకు కంప్లయింట్ చేయాలి. మన ఆర్థిక వ్యవస్థను మనం కాపాడుకుందాం.