Sunday, April 5, 2026

*రూ.లక్ష ఖర్చుతో బిజెపి కార్యకర్తకు లేజర్ ఆపరేషన్.!*————————-* గాయపడిన యువకుడికి డా. అనూప్ రావు అండ* కోరుట్లలో ‘వీర హనుమాన్ విజయయాత్ర’లో ప్రమాదం* తక్షణ స్పందనతో ప్రాణాపాయం తప్పించుకున్న యువకుడు———*

నేటి సాక్షి – కోరుట్ల ( రాధారపు నర్సయ్య )*కోరుట్ల పట్టణంలో ఇటీవల నిర్వహించిన ‘వీర హనుమాన్ విజయయాత్ర’లో ప్రమాదవశాత్తు గాయపడిన యువకార్యకర్తకి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా. అనూప్ రావు అండగా నిలిచి తన సొంత ఖర్చుతో శస్త్రచికిత్స చేయించడం స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది.!*ప్రమాదం – తక్షణ స్పందన.!*కోరుట్ల పట్టణంలో జరిగిన ‘వీర హనుమాన్ విజయయాత్ర’ సందర్భంగా గుర్రాల రాజ్‌కుమార్ ప్రమాదవశాత్తు ముక్కుపై తీవ్ర గాయానికి గురయ్యాడు. సంఘటన చోటుచేసుకున్న వెంటనే స్పందించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా. అనూప్ రావు, గాయపడిన యువకుడిని కోరుట్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స అవసరమని గుర్తించి వెంటనే తదుపరి చర్యలు చేపట్టారు.*లేజర్ ఆపరేషన్‌కు డాక్టర్ అనూప్ రావు సహాయం.!*యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో డా. అనూప్ రావు స్వయంగా ముందుండి గాయపడిన యువకుడిని కరీంనగర్‌కు తరలించి అక్కడి ప్రముఖ ఈఎన్టీ ఆసుపత్రిలో లేజర్ ఆపరేషన్ చేయించారు. ఈ చికిత్స కోసం సుమారు లక్ష రూపాయలకు పైగా ఖర్చును తన సొంతంగా భరించడం విశేషం. సమయోచితంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల బాధితుడు ఆరోగ్యంగా కోలుకుంటున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మినారాయణ, రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, కౌన్సిలర్ ఇందూరి తిరుమల వాసు, మాజీ కౌన్సిలర్ మాడవేణి నరేష్, నాయకులు సుదవేణి మహేష్, గిన్నెల శ్రీకాంత్, తులసి కృష్ణ, బెక్కం అశోక్ తదితరులు పాల్గొన్నారు. గాయపడిన యువకుడి ఆరోగ్యంపై వారు ఆరా తీశారు.ఈ సందర్భంగా కోరుట్ల భజరంగ్ దళ్ నాయకులు డా. అనూప్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కల్లెడ రోహిత్, పల్లికొండ వెంకటేష్, రాచకొండ చందు, కళ్యాణ్ తదితరులు మాట్లాడుతూ, ప్రమాద సమయంలో వెంటనే స్పందించి సహాయం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు._________

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News