Saturday, March 14, 2026

*రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తి అక్రమ కబ్జా!*—-* యాజమాన్య హక్కులు లేకుండానే ఆక్రమణ * జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఆవేదన—-*

నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )జగిత్యాల పట్టణంలోని సర్వే నంబర్‌ 138లో ఉన్న 20 గుంటల ప్రభుత్వ భూమిని యాజమాన్య హక్కులు లేకుండానే ఆక్రమించి, 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని అక్రమంగా అనుభవిస్తున్నారని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు.మంగళవారం ఇందిరాభవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..1952లో ప్రజా అవసరాల కోసం పెట్రోల్, డీజిల్, కిరోసిన్ పంపు ఏర్పాటు చేయమని మున్సిపాలిటీ 20 గుంటలు కేటాయించిందన్నారు. అందులో కేవలం 4 గుంటల్లోనే పంపు ఉంది. మిగిలిన 16 గుంటలు యాజమాన్య హక్కులు లేకుండానే ఆక్రమించారని ఆరోపించారు.మున్సిపల్ నోటీసులు జారీ చేసినా, ఆక్రమణదారులు కోర్టులో ఇంజంక్షన్‌ కోసం మాత్రమే వెళ్లారు..కానీ యాజమాన్య హక్కుల నిర్ధారణ కోసం ఏనాడు వెళ్లలేదని, ఆయన వివరించారు.1958లో రూపొందించిన ‘కీ బలా’ పత్రం అనుమానాస్పదమని, 1952 కేటాయింపుగా చూపించడం స్పష్టమైన అవకతవక అని జీవన్‌రెడ్డి అన్నారు.__*హైకోర్టు వ్యాఖ్యలు స్పష్టమే ‘కీ బలా’ అనుమానాస్పదం*హైకోర్టు ఇప్పటికే తీర్పులో ‘కీ బలా అనుమానంగా ఉంద’ని యాజమాన్య హక్కులు లేవు అని స్పష్టం చేసిందని జీవన్‌రెడ్డి గుర్తుచేశారు.’దారం వీరమల్లయ్య’ వారసులు ఎప్పటికీ యాజమాన్య హక్కులు నిర్ధారించుకోలేదు. కేవలం కబ్జాలో ఉన్నట్లు మాత్రమే పేర్కొన్నారు. పహానీల్లో ఎక్కడా పేరు లేదు. పట్టాదార్ కాలమ్‌లో పేరు లేని పత్రాలు సమర్పించారని పేర్కొన్నారు.అయినా ఇప్పటి వరకు వారు కోర్టును ఆశ్రయించకపోవడం వెనుక ఉద్దేశం స్పష్టంగా ఉందని జీవన్‌రెడ్డి విమర్శించారు.2004 లోనే మున్సిపల్ సబ్‌ కమిటీ ఈ ఆస్తి ప్రభుత్వానికి చెందిందని తేల్చినా, 16 గుంటల స్వాధీనం ఇప్పటి వరకు జరగకపోవడం స్థానిక అధికారుల నిర్లక్ష్యమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.*ప్రభుత్వ ఆస్తులు కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత*’మున్సిపాలిటీ ఇప్పుడు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉంద’ని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు.రోడ్డు విస్తరణ పనుల్లో పెట్రోల్ బంక్‌ జనరేటర్ గది ప్రధాన ఆటంకమైందని, ఆ స్థలాన్ని ప్రజా అవసరాలకు వినియోగించాలనే మున్సిపల్ తీర్మానం 140 ఇప్పటికీ అమలులో ఉందని చెప్పారు.’పెట్రోల్, డీజిల్, కిరోసిన్ కోసం ఇచ్చిన భూమిని ఇతర అవసరాలకు వినియోగించడం చట్టపరంగా తప్పు. నిజంగా హక్కులు ఉంటే ఇప్పటికీ కోర్టును ఆశ్రయించి ఉండేవారు. ఇప్పుడు మాత్రం అక్రమ కబ్జాతో సుమారు 100 కోట్ల ఆస్తిని అనుభవిస్తున్నార’ని జీవన్‌రెడ్డి మండిపడ్డారు.ప్రభుత్వ ఆస్తులను రక్షించడం ప్రతి పౌరుడి, ప్రతి ప్రజా ప్రతినిధి బాధ్యత అని ఆయన హితవు పలికారు.’ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మున్సిపల్ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, మున్సిపల్‌ డైరెక్టర్‌, జిల్లా కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్‌, కమిషనర్‌లకు లేఖలు రాస్తాం. ఈ భూమిని స్వాధీనం చేసుకుని ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలనే మా డిమాండ్‌’అని ఆయన స్పష్టం చేశారు.జీవన్‌రెడ్డి చివరగా మాట్లాడుతూ ‘రాజ్యాంగంలో నాలుగో స్తంభంగా పేర్కొన్న పాత్రికేయులు కూడా ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు ముందుకు రావాల’ని పిలుపునిచ్చారు._______

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News