నేటి సాక్షి – కోరుట్ల ( రాధారపు నర్సయ్య )కోరుట్ల మండలం నాగులపేట గ్రామంలో నాగులపేట మాజీ సర్పంచ్ కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి దయార్ద్ర హృదయానికి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.తన స్వంత నిధులు 5 లక్షల రూపాయలతో నిర్మించబోయే ప్రహరీ గోడ నిర్మాణంతోపాటు..టాయిలెట్స్ నిర్మాణానికి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ శుక్రవారం శుంఖుస్థాపన చేశారు.ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డిని ఎమ్మెల్యే అభినందించగా.. విద్యార్థిని విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.





