నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)ఈట్ స్ట్రీట్ పనులు అన్ని రెండు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా అచ్యుత దేవరాయ మార్గంలో ఏర్పాటు చేస్తున్న ఈట్ స్ట్రీట్ పనులను శుక్రవారం ఉదయం అధికారులతో కలసి కమిషనర్ పరిశీలించారు. ఈట్ స్ట్రీట్ ప్లాన్, వాహనాల పార్కింగ్ తదితర వాటిని అధికారులు కమిషనర్ కు వివరించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థలు అందుబాటులోకి తెచ్చేందుకు ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సుమారు కోటి రూపాయల భారత ప్రభుత్వ నిధులతో 12 కంటైనర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వాహనాలు పార్క్ చేసుకునేందుకు పార్కింగ్ స్థలం, పిల్లలు ఆడుకునేందుకు ప్లే జోన్, వాటర్ పౌంటైన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పనులను వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. ఈట్ స్ట్రీట్ లోని షాపులను టెండర్ ద్వారా కేటాయించడం జరుగుతుందని తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంసుందర్, డి. ఈ. వెంకట ప్రసాద్, తదితరులు ఉన్నారు.





