*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లోని తిరుమలపూర్ గ్రామానికి చెందిన పబ్బ సరోజన అనే మహిళ మండల కేంద్రం లోని యూనియన్ బ్యాంకు ఖాతా ద్వారా కేంద్ర ప్రభుత్వం బీమా పతక మైన ప్రధానమంత్రి జీవన జ్యోతి జే జే బి వై భీమా యోజన నమోదు చేయించు కున్నారు దురదృష్టవశతు ఇటీవల కాలంలో మరణించడం జరిగింది. కుటుంబ సభ్యులు సంబంధిత పత్రాలను బ్యాంకు వారికి సమర్పించగా, భీమాకు సంబంధించిన రెండు లక్షల రూపాయలను నామిని పబ్బ లచ్చయ్యకు గ్రామపంచాయతీ ఆవరణంలో గ్రామ సర్పంచ్ కాశ అంజలి గంగాధర్ పంచాయతీ కార్యదర్శి విక్రమ్ వివో ఏ జయపాల ఆధ్వర్యంలో పబ్బ లచ్చయ్యకు అందజేయడం జరిగింది. అనంతరం నూతన సర్పంచ్ ఉప సర్పంచ్ లకు వివో ఏ జయపాల ఎఫ్ ఎల్ సి మధుసూదన్ సి ఎఫ్ ఎల్ రమేష్ వెంకటేష్ విజయ్ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు ప్రతి ఒక్కరూ భీమా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఎల్ సి మధు సుధన్, సి ఎఫ్ ఎల్ కౌన్సిలర్లు రమేష్, వెంకటేష్, విజయ్, మరియు గ్రామ సర్పంచ్ కాశ అంజలి గంగాధర్.ఉపసర్పంచ్ అంజయ్య. సిసి మహేష్ వివో ఏ జయపాల కార్యదర్శి విక్రమ్ అంగన్వాడి టీచర్ హరిత లాల్ బి లలిత ఆశ వసంత మరియు మహిళా సంఘ సభ్యులు. గ్రామస్తులు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

