Saturday, March 21, 2026

*రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం** మున్సిపాలిటీలు, ఆసుపత్రులు నిధుల కోసం ఇంకా ఎదురుచూపులే.!* కోరుట్ల–మెట్‌పల్లి ప్రాంతంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపిన ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్* ఆగిపోయిన ప్రభుత్వ ఆసుపత్రి–మార్కెట్ పనుల్లో వేగం కావాలంటూ స్పష్టమైన డిమాండ్* మున్సిపాలిటీలకు నయాపైసా నిధులు రాక అభివృద్ధి నిలిచిపోయిందని ఆరోపణ—-*

నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తికావస్తున్నా రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు ఒక్క పైసా నిధులూ విడుదల కాలేదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ విమర్శించారు. *కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం*బుధవారం కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ..గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతీ సంవత్సరం టీఐయుఎఫ్ఐడీసీ, పట్టణ ప్రగతి నిధులు సక్రమంగా వచ్చి పట్టణాల్లో పకడ్బందీగా పనులు జరిగేవని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత పాలనలో డ్రైనేజీలు, అంతర్గత రహదారులు పూర్తిగా దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. పట్టణానికి ఇటీవల యూఐడీఎఫ్ ద్వారా వచ్చిన రూ.18.70 కోట్ల అభివృద్ధి ప్రణాళికను పరిశీలించిన ఎమ్మెల్యే, ఈ నిధులను పూర్తిగా మౌలిక వసతులకే వినియోగించాలని అధికారులకు సూచించారు.*ఆసుపత్రి–ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు అర్థాంతరంగా ఆగి ప్రజలు అవస్థలు*మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, స్కూల్స్, రోడ్లు..ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వంలో 90% పూర్తైన పనులేనని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండేళ్లుగా ఓ అడుగు ముందుకు వేయలేదని ఎమ్మెల్యే సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. మెట్‌పల్లి ఆసుపత్రి పాడైపోయి పెచ్చులు ఊడిపోతున్నా ఎవరూ పట్టించుకోలేదని, పరికరాలు, పెయింటింగ్, స్టాఫ్ అన్నీ పెండింగే అని స్పష్టం చేశారు.దయచేసి మా కోరుట్ల నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని వెంటనే కనీస వసతులు కల్పించండని విజ్ఞప్తి చేశారు.అవసరమైతే ఆసుపత్రికి మీ పేర్లు పెట్టుకోండి కానీ ప్రజలు పడుతున్న ఇబ్బందులు తక్షణమే తగ్గేలా పనులు పూర్తి చేయండి.. అంటూ ఆయన ప్రభుత్వాన్ని కోరారు.*అవసరాలపై దృష్టిపెట్టండి… లేని పనులకు కోట్ల రూపాయలు వృథా చేయొద్దు*కోరుట్ల పట్టణ శివారులో రూ.2 కోట్లతో పార్క్ నిర్మాణ ప్రతిపాదనను విరమించుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకిప్పుడు అత్యవసరమైనది పార్కు కాదని, డ్రైనేజీలు, రోడ్లు, కల్వర్టులు, ఆసుపత్రి, మార్కెట్ లాంటి తక్షణ అవసరాలే ముందున్నాయని స్పష్టం చేశారు. ముందుగా ప్రారంభించిన పనులు పూర్తిచేసి ప్రజలకు సేవలందించండని కోరారు…ఆ తర్వాతే కొత్త కలలు కనండి.! అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్న మా ప్రాంత ప్రజలను నిర్లక్ష్యం చేయొద్దని ఎమ్మెల్యే సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్, డీఈ సురేష్, జేవో శివకుమార్, టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రవీణ్, రమ్య తదితరులు పాల్గొన్నారు.___

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News