నేటి సాక్షి.కొమురం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి డిసెంబర్ 17 కాగజ్నగర్ మండలo బురదగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా బిఆర్ఎస్.(కోనప్ప వర్గం) బలపరిచిన చేటరే స్వాతి 142 ఓట్లతో గెలుపొందారు.సర్పంచ్ స్వాతి మాట్లాడుతూ రెండవసారి సర్పంచ్ గా గెలిపించినందుకు స్వాతి ( పోశెట్టి ) గ్రామపంచాయతీ ప్రజలకు. మరియు పార్టీ నాయకులకు. కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినారు గ్రామపంచాయతీని మరింత అభివృద్ధి పథంలో తీసుకు వెళ్తానని నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసమే పాల్పడతానని ఈ సందర్భంగా తెలిపారు.





