నేటి సాక్షి,నల్లబెల్లి డిసెంబర్ 30 : నల్లబెల్లి మండల కేంద్రంలోని కాంక్రీట్ రెడీ మిక్స్ ప్లాంట్‌కు చెందిన భారీ వాహనాలు అనుమతులు లేకుండా ఎస్సారెస్పీ కాలువ కట్టపై నుంచి రాకపోకలు సాగిస్తున్నాయన్న ఆరోపణలపై మంగళవారం విచారణ చేపట్టారు.రెడీమిక్స్ ధూళి వల్ల సమీపంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినులు అనారోగ్యాల బారిన పడుతున్నారని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి జిల్లా కలెక్టర్‌కు మెమోరాండం అందజేశారు.దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశాల మేరకు రెడీమిక్స్ ప్లాంట్ నిర్వహణపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి.ఈ నేపథ్యంలో ఎస్సారెస్పీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నేడు స్థల పరిశీలన చేసి విచారణ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎస్సారెస్పీ డీఈ రవి, ఏఈ పవిత్ర, కాంగ్రెస్ నాయకులు బత్తిని మహేష్, పరికి త్యాగరాజు, కోలా లింగయ్య, గాజు బిక్షపతి ,సురేష్ ,కిషోర్ పాల్గొన్నారు.

