నేటి సాక్షి:—కర్నూలు లో జరిగిన మాదక ద్రవ్యాల పై అవగాహన కార్యక్రమం కి ముఖ్య అతిథిగా డాక్టర్. గోవింద రెడ్డి గారు. విచ్చేయడమైనది. విద్యార్థులు మరియు మరియు ఇతరత్రా సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో డాక్టర్.గోవింద రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా విద్యార్థులు చిన్న వయసులోనే మద్యానికి బానిసై, తమ జీవితాలను సగంలోనే నాశనం చేసుకుంటున్నారు. తమ తల్లి తండ్రులు చెప్పిన విధంగా చెప్పినట్టు చదువుకొని మన దేశానికి మన రాష్టానికి మంచి పేరు తీసుకురావాలి అని. చెప్పారు .అంతేకాకుండా *శ్రీనివాసులు యాదవ్* గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ* :– డ్రగ్స్. వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నారు. మరియు తనువు చాలిస్తున్నారు. అంతేకాకుండా మద్యం, డ్రగ్స్ వలన యాక్సిడెంట్స్ ఎక్కువ గా ప్రమాదాలకు గురు అవుతున్నారు కాబట్టి. చిన్న వయసులోనే మద్యం కి బానిసలు కావద్దండీ మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని మరియు చిన్న వయసులో పెళ్లి ళ్ళు చేసుకొని మీరు మద్యానికి బానిసలు అయి ఏదో జరగరానిది జరిగితే చిన్న వయసులో మిమ్మలి నమ్ముకొని వచ్చిన అడకూతురులకు మీరు దూరమై పోతారు. అంతేకాకుండా మీ శరీరంలో డ్రగ్స్ కి బానిస తత్వం అనేది ఒక చెడు అలవాటు దీని వలన శరీరంలో లివర్ డ్యామేజ్ మరియు గుండె సమస్యలు ఇంకా చాలా రోగాల బారిన పడి చనువు చలిస్తారు కాబట్టి. ఈ డ్రగ్స్ ఒద్దు అనే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మద్యానికి డ్రగ్స్ కి దూరంగా ఉండి.. మీ తల్లి తండ్రులు చెప్పిన విధంగా చదువుకొని మీరు మీ ఉన్నత స్థానం లో ఎదుగుతారని కోరుకుంటున్నాను అని శ్రీనివాసులు యాదవ్ గారు కొన్ని సూచనలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం గా జరిగింది.





