నేటి సాక్షి, అన్నమయ్య, శర్మ ~ చిత్తూరు జిల్లా :-: ఏపీలో తాజాగా వైఎస్ఆర్ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆయన అభిమానులు, వైసీపీ కార్యకర్తలు పొట్టేళ్లను నరికి రక్త తర్పణాలు చేసినట్లు అధికార కూటమి ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆదివారం వైసీపీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. వైయస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ శ్రేణులు రప్పా రప్ప అన్నారని పోలీసులు కూడా కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, కార్యకర్తల్ని వీధుల్లో నడిపించడం వంటి చర్యలకు దిగారు. దీంతో వైసీపీ అలర్ట్ అయింది. ఓవైపు కూటమి సర్కార్ తమపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు తమ క్యాడర్ కూ కీలక సూచన చేసింది. తాజాగా పొట్టేళ్ల రక్తతర్పణాల వ్యవహారంలో వైసీపీ క్యాడర్ ను ప్రభుత్వం టార్గెట్ చేయడంపై పేర్ని నాని పైర్ అయ్యారు. గతంలో చంద్రబాబు, బాలకృష్ణ పుట్టినరోజులు, గెలుపుల నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు చేసిన రక్త తర్పణాల వీడియోల్ని ఆయన బయటపెట్టారు. గత వైసీపీ హయాంలోనే జరిగిన ఇలాంటి చర్యలపై కూటమిలో భాగస్వామయిన పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు స్పందించలేదని పేర్ని ప్రశ్నించారు. అప్పుడే పవన్ స్పందించి వాళ్లను మోకాళ్లపై నిలబెట్టి, కాలుకు కాలు కీలుకు కీలు తీసి ఉంటే ఇలాంటివి ఇప్పుడు పునరావృతం అయ్యేవి కావన్నారు. ఈ రాష్ట్రంలో మీరు రెడ్ బుక్ పేరుతో బెదిరింపులకు దిగడం వల్లే మా వాళ్లు రప్పా.. రప్పా అని అంటున్నారని పేర్ని కౌంటర్ ఇచ్చారు. గదిలో పెట్టి పిల్లిని కొడితే తిరగబడుతుంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు పిల్లి కంటే తక్కువా. ఏ క్షణమైనా తిరగబడొచ్చు. కూటమి పాలనంతా రాక్షస పాలనే. వాళ్లు 18 నెలల పాలనను వెధవల్లా పరిపాలించారు. రేపు మనకూ రిటైర్ అయిన అధికారులు వస్తారు. సిట్ లు వేస్తాం. తప్పులు చేయొద్దని వైసీపీ కార్యకర్తలకు పేర్ని సూచించారు. చట్ట పరిధిలో తప్పులు చేసిన వాళ్లను శిక్షిద్దాం. కాబట్టి వీళ్లను చూసి మీరు తప్పులు చేయకండన్నారు.~~~~~~~~~~~~~~~~~~

