Tuesday, March 10, 2026

రెప రెపలాడిన మువ్వన్నెల జెండా రాయికల్ లో ఘనంగా గణతంత్ర్య దినోత్సవం

నేటి సాక్షి, రాయికల్ ( ఇమ్మడి విజయ్ కుమార్ ) : రాయికల్ పట్టణంతో పాటు మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు,గ్రామ పంచాయతీ కార్యాలయం, మరియు అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో సోమవారం గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మువ్వన్నెల జెండా ఆకాశంపై రెపరెపలాడింది. రాయికల్ పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ నాగార్జున జెండా ఎగరవేశారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో చిరంజీవి జెండాను ఎగరవేసి జాతీయగీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆర్. ఐ లు పద్మయ్య, దేవదాస్ మరియు ఎంపీఓ సుష్మ లతోపాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News