Sunday, March 15, 2026

రెవెన్యూ శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే…!!!

సబ్ రిజిస్టర్ కార్యాలయ నిర్మాణం పై విజ్ఞాపన…!!!

సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలో జీవో జారీ విడుదల చేయనున్నట్లు హామీ…!!!

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా :

వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మంగళవారం రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని ప్రత్యేకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనపర్తి జిల్లా కేంద్రంలో సబ్ రిజిస్టర్ కార్యాలయా నూతన భవన నిర్మాణం పై విజ్ఞాపన సమర్పించడంతో సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే భవన నిర్మాణాలకు సంబంధించిన జీవో విడుదల చేయనున్నట్లు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి, జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ కి, జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు కి, పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి కి, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News