నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ (సందెల రాజు)తెలంగాణ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారమే ద్యేయంగా నిర్వహిస్తున్న రెవిన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని హన్మకొండ ఆర్ డి ఓ రమేష్ రాథోడ్, హాసన్ పర్తి తహశీల్దార్ చల్ల ప్రసాద్ కోరారు. శుక్రవారం హాసన్ పర్తి మండలం లోని పెగడపల్లి గ్రామం లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది. ఇందులో మొత్తం 362 అప్లికేషన్స్ వచ్చాయని, అందులో ఎక్కువగా సాధాబైనామా అప్లికేషన్స్ రావడం జరిగిందని తహసిల్దార్ చల్ల ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో, మండల డిప్యూటీ తహసీల్దార్ రహీం పాషా, ఆర్ ఐ లు ఫాజిల్, రాజేంద్ర ప్రసాద్, జూ అసిస్టెంట్స్, రికార్డ్ అసిస్టెంట్స్ గౌస్, సతీష్, వి ఆర్ ఏ లు అనిల్, సస్య, సమ్మయ్య, పున్నం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

