*నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్ ఆదేశాల మేరకు పట్టణంలో గల రెస్టారెంట్లు, హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో శనివారం తనిఖీలు నిర్వహించారు.*పరిశుభ్రత పాటించకపోతే కఠిన చర్యలు*పరిశుభ్రత పాటించని, మరియు సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడే యజమానులకు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ.. పట్టణంలోని స్వీట్ హోమ్ లు, బేకరీలు, హోటల్లు, రెస్టారెంట్లు నిర్వహించే యజమానులు పరిశుభ్రతను పాటించాలని, నాణ్యమైన పరిశుభ్రమైన తాజా ఆహారాన్ని మాత్రమే ప్రజలకు విక్రయించాలని, మరియు సరైన నాణ్యత ప్రమాణాలను పాటించాలని తెలియజేశారం.అంతేకాకుండా సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని కోరారు. లేనిపక్షంలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి భారీ మొత్తంలో జరిమానాలు విధించడంతోపాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు. ఈ తనిఖీలలో సానిటరీ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్ ,రికార్డ్ అసిస్టెంట్ జగదీష్, వార్డ్ ఆఫీసర్లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.__

