నేటి సాక్షి, హుస్నాబాద్ : హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర సందర్భంగా ఆదివారం అమ్మవారిని పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ గాజుల శ్యాం ప్రసాద్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. అంతకు ముందు వారితో ప్రత్యేక పూజలు చేయించారు.