నేటి సాక్షి, హైదరాబాద్ : ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నారు. ఆయన మనవడు అమెరికా నుంచి రేపు వస్తున్నందున రేపు అంతిమసంస్కారాలు నిర్వహించాలని నిర్ణయించారు. అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు జరుగనున్నాయి. ప్రస్తుతం ఫిల్మీ సిటీలో ఆయన భౌతికకాయాన్ని సందర్శనార్థం ఉంచారు. ఆయన పార్థివదేహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. పెద్ద సంఖ్యలో ఆయన భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.

