రేషన్ దుకాణాలపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం…. రిజర్వేషన్ల ప్రకారమే రేషన్ షాపులు కేటాయించాలి. మరికల్ మండల బిజెపి కార్యదర్శి పోలేమోనీ రమేష్ కుమార్ ….. నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 18,మరికల్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ రేషన్ దుకాణాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని మరికల్ మండల బిజెపి పార్టీ కార్యదర్శి పోలేమోని రమేష్ కుమార్ కోరారు. బుధవారం మరికల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరికల్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ రేషన్ దుకాణాలను రెవెన్యూ శాఖ పౌర సరఫరా శాఖ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా సన్నబియా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు ఇట్టి పథకాన్ని కొందరు డీలర్లు ప్రజలకు సక్రమంగా అందించడంలో విఫలమవుతున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల మరికల్ మండల కేంద్రంలో ఒక డీలర్స్ షాప్ లో 14 క్వింటాలన్నర సన్నబియ్యాన్ని హైదరాబాద్ చెందిన ఎంపోర్స్మెంట్ శాఖ అధికారులు పట్టుకోవడం జరిగిందన్నారు. పట్టుకున్న అట్టి రేషన్ దుకాణంలో బియ్యం ఎలా సరఫరా చేస్తారని ఆయన అధికారులను ప్రశ్నించారు. అదేవిధంగా అట్టి రేషన్ దుకాణాన్ని మరికెల్లో ఉన్న వారికి దుకాణాలకు ఇవ్వకుండా పక్క గ్రామమైన ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన డీలర్ కు అప్పజెప్పడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. వెంటనే అధికారులు స్పందించి అట్టిరేషన్ దుకాణాన్ని మరికల్ డీలర్లకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇట్టి విషయంలో మండల తాసిల్దార్ గారు స్పందించి మరికల్ డీలర్లకే పట్టుకున్న రేషన్ దుకాణాన్ని అప్పగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సన్న బియ్యం పథకంలో అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు కోరారు. రేషన్ దుకాణాలపై రిజర్వేషన్ల ప్రకారం కేటాయించాలని ఆయన ప్రభుత్వ అధికారులను కోరారు . ప్రస్తుతం మరికల్ మండల కేంద్రంలో .త్వరలోనే బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కలెక్టర్కు, నారాయణపేట ఆర్డీవోకు ,మండల తాసిల్దార్ కు వినతి పత్రాలు అందజేయడం జరుగుతుందని ఆయన వివరించారు. మరికల్ మండల తాసిల్దార్ వివరణ… మరికల్ మండల కేంద్రంలో ఇటీవల 14 క్వింటాలన్నర హైదరాబాద్కు చెందిన ఎంపర్స్మేంట్ పట్టుకోవడం జరిగింది ఇట్టి విషయంపై మరికల్ మండల తాసిల్దార్ రామకోటిని వివరణ అడగ్గా హైదరాబాద్కు చెందిన ఎంఫోర్స్మెంట్ అధికారుల ఆధ్వర్యంలోనే విచారణ జరిగిందని, ఇట్టి విషయంపై అధికారులతో చర్చిస్తామని ఆయన వివరించారు.

