నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి)
కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ యువత సొసైటీ మరియు అర్బన్ కాలనీ లోగల రేషన్ షాపులను శనివారం తనిఖీ చేసిన జిల్లా పౌరసరాఫరాల అధికారి DTCS ఉమాపతి మరియు AM. రేషన్ షాపులలో మిగిలి ఉన్న బియ్యాన్ని త్వరగా పంపిణీ చేయాలని, మరియు రేషన్ తీసుకుంటున్న వారిని రేషన్ డీలర్లు అందుబాటులో ఉండి బియ్యాన్ని సక్రమంగా పోస్తున్నారా లేదా అని తెలుసుకున్నారు, సరైన సమయంలోనే పోయడం జరుగుతుందని కార్డుదారులు తెలిపారని, సంబంధిత రేషన్ డీలర్లు ఎలాంటి అక్రమాలకు పాల్పడడం లేదని, మూడు నెలలకు సంబంధించిన సన్న బియ్యాన్ని సంబంధిత రేషన్ డీలర్లు అందుబాటులో ఉండి పంపిణీ చేస్తున్నారని తెలిపారు.





