నేటి సాక్షి – కోరుట్ల (టౌన్)
( గణేష్ గొల్లపల్లి
కోరుట్ల నియోజకవర్గంలో జనుము మరియు జిలుగు కేంద్రాలని ప్రారంభించడానికి వ్యవసాయ శాఖ అధికారులు కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్ ని ఆహ్వానించగా…. రైతన్నలకు మద్దతుగా తమ ఆహ్వానాన్ని తిరస్కరించి నిరసన వ్యక్తం చేసారు.
గత సంవత్సరం 1000 రూపాయలకు ఒక బస్తా ఉంటె ఈ సంవత్సరం 2000 రూపాయలు చేయడం దారుణం అని, ఈ ప్రభుత్వానికి రైతన్నల పట్ల, వ్యసాయం పట్ల చిత్తశుద్ధి లేదని అన్నారు.రైతుల కష్టాన్ని దోచుకుంటున్న ఈ ప్రభుత్వానికి రైతులే బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.

