నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి ఫిబ్రవరి 181. రైతులందరికీ ప్రత్యేక 11 అంకెల గుర్తింపు సంఖ్యను జారీ చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యకలాపాన్ని రైతు సేవా కేంద్రాల RSK ఇంచార్జ్‌లు చేస్తారు. లేకపోతే మీరు ఎక్కడున్నా, మీ ఆధార్ నంబర్‌తో ఫోన్‌లో RSK ఇన్‌ఛార్జ్‌ని సంప్రదించండి & ID నంబర్‌ను సృష్టించడానికి ఆధార్ OTP ని RSK ఇన్‌ఛార్జ్‌కి షేర్ చేయాలి.2. వ్యవసాయం & అనుబంధ శాఖల పథకాల ప్రయోజనం, పిఎం-కిసాన్ అన్నదాత సుఖీభవ ఆర్థిక సహాయం పొందడానికి, అందరు రైతులు వారి RSK ఛార్జీల నుండి ఈ ప్రత్యేక ఐడి నంబర్‌ను వెంటనే పొందాలి.3. రైతులు మీ RSK ఇన్‌ఛార్జ్ నుండి వెంటనే ఐడి నంబర్ పొందాలి. లేకుంటే మీకు PM-KISAN అన్నదాత సుఖీభవ ఆర్థిక సహాయం లభించదు.4. రైతులందరు 2026 ఫిబ్రవరి 25 తేదీ లోపు ప్రత్యేక ID నంబర్లు తీసుకోవాలి.5. RSK ఇంఛార్జ్‌ల నుండి ప్రత్యేక ID నంబర్‌ని ఆన్‌లైన్‌లో పొందడానికి, రైతులు తమ ఆధార్ కార్డు, భూమి వివరాలు 1బి & ఆధార్ లింక్ చేయబడిన మొబైల్ కలిగి ఉండాలి.6. రైతులందరూ తమ ఆర్‌ఎస్‌కె ఇంచార్జ్‌లను ఆధార్ కార్డ్, భూమి వివరాలు & ఆధార్ లింక్డ్ మొబైల్‌తో సంప్రదించాలి.అందువలన ఈ వారంలోనే రైతులందరూ మీ RSK ఇన్‌ఛార్జ్‌ల నుండి వెంటనే రైతు యూనిక్ ఐడి 11 అంకెల నంబర్ పొందడానికి ప్రయత్నించండి. ఈ ప్రయోజనం కోసం వారితో కూర్చొని OTP చెప్పండి.జి. మోహన్ కుమార్





