నేటి సాక్షి వికారాబాద్ :వికారాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ సమీపంలో ఉన్న ఎరువుల దుకాణాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎం/ఎస్ గుల్షన్ బ్రదర్స్, ఎం/ఎస్ శ్రీ లక్ష్మీ నారాయణ ఏజెన్సీస్ ఎరువుల దుకాణాలను సందర్శించి అక్కడ ఎరువుల విక్రయ విధానం, నిల్వలు రికార్డులను పరిశీలించారు. దుకాణాల్లో ఉన్న యూరియా, డి.ఏ.పీ, పొటాష్ తదితర ఎరువుల నిల్వలను పరిశీలించారు.రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయిస్తున్నారా, సరైన బిల్లులు ఇస్తున్నారా అనే విషయాలను తనిఖీ చేశారు.దుకాణదారులు స్టాక్ రిజిస్టర్, విక్రయాల రికార్డులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎరువులను సరఫరా చేయాలని, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రైతులకు అవసరమైన ఎరువులు సరిపడా నిల్వ ఉంచాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు..ఈ తనిఖీలో భాగంగా ఎరువుల విక్రయం ఈ-పాస్ (e-POS) యంత్రం ద్వారా జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్, ఎరువుల బుకింగ్ యాప్లో నమోదు చేస్తున్న వివరాలను పరిశీలించి సంబంధిత రికార్డులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు.దుకాణాల్లో ఉన్న ఎరువుల వాస్తవ నిల్వలను (గ్రౌండ్ బ్యాలెన్స్) కూడా పరిశీలించి రికార్డులతో సరిపోల్చి తనిఖీ చేశారు.అదేవిధంగా పురుగుమందుల విక్రయానికి సంబంధించిన లైసెన్సులు ప్రిన్సిపల్ సర్టిఫికేట్లను కూడా పరిశీలించారు.రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే ఎరువులు పురుగుమందులు విక్రయించాలని, ప్రతి విక్రయాన్ని తప్పనిసరిగా ఈ-పాస్ యంత్రంలో నమోదు చేయాలని దుకాణదారులకు సూచించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరఫరా వ్యవస్థను సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్ల వ్యవసాయ అధికారి రాజా రత్నం, రెగ్యులర్ ఎ డి ఎ సందీప్ కుమార్ , ఎం ఎ ఓ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.





