నేటి సాక్షి:–జూపాడుబంగ్లా మండల కార్యాలయ లో ఈరోజు జరిగిన ప్రజా వేదిక కార్యక్రమం జరుపడమైనది. జూపాడుబంగ్లా మండల అధికారి ఎంపిడిఓ, గోపి కృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రజా వేదిక కార్యక్రమం జరుపడమైనది. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా నందికొట్కూరు శాసన సభ్యులు ఎమ్మెల్యే గిత్త. జయసూర్య పాల్గొన్నారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ,కార్యక్రమంలో గిత్త జయసూర్య వివిధ సమస్యలతో వచ్చిన ప్రజలతో మమేకమయ్యారు .ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి యొక్క సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు .సమస్యలపై ఇచ్చిన అర్జీలను పరిశీలించి సంబంధిత అధికారులకు సమస్యను పరిష్కరించాలని ఆదేశాలిచ్చారు.మరియు ఇటీవలే మంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన మొక్కజొన్న ప్రతి రైతులకు, ఏలాంటి ఇబ్బందులు లేకుండా మన కూటమి ప్రభుత్వం అందరికీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ దాటికి నష్ట పోయిన ప్రతి రైతు నీ దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఎవరికి నష్టం జరిగిందో వారికి తగిన న్యాయం చేయాలి అన్నారు.కాబట్టి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను త్వరలోనే ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామని తెలియజేయడమైనది. ఎమ్మెల్యే గిత్త జయసూర్య.ఈ కార్యక్రమంలో, స్టేట్ యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు గారు, మండల కన్వీనర్ మోహన్ రెడ్డి గారు, సింగిల్విండో చైర్మన్ పిక్కిలి శ్రీనివాసులు , తత్తూరు రమణారెడ్డి గారు, పారుమంచాల శివరామిరెడ్డి , లింగాపురం వేణుగోపాల్ రెడ్డి , జూపాడుబంగ్లా జంగాలి పెద్దన్న , ప్రసన్నా రెడ్డి గారు, అధికారులు టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




