నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 30,
నారాయణపేట జిల్లాలోని మరికల్ రైతు వేదిక నందు జాతీయ ఆహార భద్రతా పథకంలో భాగంగా ఎల్ ఆర్ జి-52, ఎల్ ఆర్ జి 105, పి ఆర్ జి-176 కంది విత్తనాలు, విత్తన శుద్ధి కోసం రైజోబియం కల్చర్ ఇవ్వడం జరిగింది. కంది రకాల గురించి రైతులకు విపులంగా వివరించడం జరిగింది.
కంది లో డీబ్లింగ్ పద్ధతి గురించి కూడా వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రెహమాన్ పిఎసిఎస్ ధన్వాడ, ప్రెసిడెంట్ వెంకటరామిరెడ్డి మరియు మండల వ్యవసాయ విస్తరణ అధికారి పరుశురాం మండల నాయకులు సూర్యమోహన్రెడ్డి జి కృష్ణయ్య పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.





