నేటిసాక్షి, మిర్యాలగూడ : రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని మిర్యాలగూడ మండల వ్యవసాయ అధికారి సైదా నాయక్ అన్నారు. శనివారం మండల పరిధిలోని వెంకటాద్రిపాలెం, తుంగపాడు, శ్రీనివాస్ నగర్ లోని రైతు వేదికలలో రైతులకు పీఎం కిసాన్ ఫార్మర్ రిజిస్ట్రీ పై అవగాహన సదస్సులను నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి సైదా నాయక్ మాట్లాడుతూ, రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నుండి రైతులకు అందించే అన్ని పథకాలు ఇకపై ఫార్మర్ రిజిస్ట్రీ నెంబర్ ఆధారంగా అమలు చేయబడతాయని, అందువల్ల రైతు సోదరులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా లబ్ధి పొందాలంటే వెంటనే నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ షఫీ, సంబంధిత సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

