నేటిసాక్షి, మిర్యాలగూడ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూరియా అక్రమ నివారణకు ప్రత్యేక యాప్ ను నమోదు చేసినట్లు, ముందుగా రైతులు గూగుల్ ప్లే స్టోర్ లో యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో తమ వివరాలను నమోదు చేసిన తర్వాత, రైతులు 24గం.లల్లో యూరియా తీసుకెళ్లాలని, దామరచర్ల మండల వ్యవసాయ శాఖ అధికారి రుషేంద్ర మణి అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం వీర్లపాలెం గ్రామ పంచాయతీ కేంద్రంలోని రైతులకు యూరియా బుకింగ్ యాప్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,యూరియా డీలర్లు ప్రతి వివరాలను యాప్ లో నమోదు చేయాలని, రైతులందురు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నేనావత్ శ్రావణి నాగు నాయక్, ఏఈఓ ప్రియాంక, పార్వతీ, రైతులు వెంకట్ రెడ్డి, పుల్లారెడ్డి, తిరుపతి రెడ్డి, అప్పి రెడ్డి, కృష్ణ రెడ్డి గోవింద రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.





