నేటిసాక్షి, మిర్యాలగూడ : రైతులు యూరియా పై ఆందోళన చెందనవసరం లేదని, యూరియాను ప్రభుత్వం అందరికి సరిపడ అందుబాటులో ఉంచిందని దామరచర్ల మండల వ్యవసాయ శాఖ అధికారి రూషేంద్రమణి తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతులకు యూరియా యాప్ లో బుకింగ్ నమోదు వివరాలు సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి ఒక్క రైతు యూరియా కు తప్పకుండా యాప్ లో ముందుగా బుక్ చేసుకోవాలని, చేసుకున్న 24గం. లల్లో యూరియా తీసుకెళ్లాలని తెలిపారు. రైతులకు యూరియా బుకింగ్ లో ఏమైనా సమస్యలు ఎదురైతే మండంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. డీలర్లు యూరియా ఎగుమతులు, దిగుమతుల వివరాలను పటిష్టంగా నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ పార్వతి, రైతులు రమేష్, బాలు, మట్టారెడ్డి, లాలూ, మేష్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

