నేటి సాక్షి వికారాబాద్ : వికారాబాద్ మార్కెట్ కమిటీ మొదటి పాలకవర్గ సమావేశం చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ గారి అధ్యక్షతన మార్కెట్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ పాలక మండలి డైరెక్టర్లు ఇచ్చిన సూచనలు సలహా మేరకు ముందుకెళ్తామని సమావేశంలో రైతుల సమస్యలపై చర్చించి అధికారులకు సూచనలు ఇచ్చారు… తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, వికారాబాద్ శాసనసభ్యులు శ్రీ. గడ్డం. ప్రసాద్ కుమార్ సహకారంతో వికారాబాద్ రైతు బజారును అభివృద్ధి చేస్తామని… కూరగాయలు విక్రయీంచడానికి రైతు కార్డు లను అందజేస్తామని తెలిపారు అదేవిధంగా అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు కలెక్టర్ గారి దృష్టికీ తీసుకెళ్లామని త్వరలో అన్నీ పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు..అదే విదంగా కమిటీ సభ్యులతో అధికారులతో కలిసి రైతు బజారును సందర్శించి అక్కడ రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురైన తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే వాటిని పరిష్కరించే దిశగా తమ కార్యచరణ ఉంటుందని వికారాబాద్ మార్కెట్ ను స్పీకర్ సహకారంతో అన్ని అభివృద్ధి పనుల విషయాల్లో ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మల్లేశం డైరెక్టర్ లు అధికారులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

