Tuesday, March 17, 2026

రైతులు పంట మార్పిడి పద్ధతులను అవలంబించాలి-వ్యవసాయ శాఖ అధికారి రూషేంద్రమణి..

నేటిసాక్షి, మిర్యాలగూడ : పంట మార్పిడి పద్ధతులను అవలంబించాలని, వాటితో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని దామరచర్ల మండల వ్యవసాయ శాఖ అధికారి రూషేంద్రమణి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల మండల పరిధిలోని తూర్పు తండా గ్రామంలో వ్యవసాయ అధికారి రూషేంద్రమణి వరి పొలాలను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె వరి పంటలో కాండం కుళ్ళు, వేరు కుళ్ళు తెగుళ్లను గమనించారు. ఈ సందర్భంగా ఆమె నివరణకు ప్రోపికోనజోల్ లేదా టేబుకోనజోల్ కార్బన్డిజం+మ్యాన్కోజప్, పిచికారి చేసుకోవాలని రైతులకు సూచించారు. రైతులు పంట మార్పిడి పద్ధతిని పాటించాలని, జిలుగు, జనుము, వంటి పచ్చి రొట్ట పంటలు వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలోవ్యవసాయ విస్తరణ అధికారులు ఆర్. పార్వతి. ఏ. సైదులు, రైతు ధనావత్ నెహ్రు, బాల మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News