నేటి సాక్షి – కథలాపూర్: కోనాపూర్ లోని రాళ్లవాగు ప్రాజెక్టు ను సోమవారం ఇరిగేషన్ అధికారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు.రాళ్ల వాగు ప్రాజెక్టు వేములవాడ నియోజకవర్గ పరిధిలోని సుమారు 3500 ఎకరాలకు సాగు నీరు అందుతుంది.కోనపూర్ ప్రోజెక్ట్ లోని హెడ్ రెగ్యులేటర్, కాలువలు, మత్తడిని పరిశీలించారు.
పాడైన హెడ్ రెగ్యులేటర్, మత్తడిపై నూతన నిర్మాణాలు,
కాలువలను వెంటనే శుభ్రం చేయాలనీ అధికారులను ఆదేశించారు.మరమ్మత్తు పనులు పూర్తయితే కథలాపూర్ మండల పరిధిలోని భూషణ్ రావు పేట్,ఊట్ పల్లి పెగ్గర్ల, చింతకుంట, గ్రామాల పరిధిలో సాగునీటికి ఇలాంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది.తద్వారా భూగర్భ జలాలు కూడా పెరగుతాయి.





