నేటి సాక్షి వికారాబాద్ :వికారాబాద్ పట్టణ కేంద్రంలోని రైతు బజారును ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు, విక్రయదారులతో రైతు బజారులోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వేసవి, వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకొని కనీస వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. రైతు బజారులో టాయిలెట్లు, షెడ్ల ఏర్పాటుతోపాటు నీటి సౌకర్యం కల్పించాలని అధికారులకు సూచించారు. వర్షపు నీరు రైతు బజార్ లోకి రాకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ సుధీర్, మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య, వైస్ చైర్మన్. అర్థ సుధాకర్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉమేష్, మార్కెటింగ్ అధికారి సారంగపాణి, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

