Monday, March 9, 2026

రైతు భరోసాపై సంబరాలు

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధన్వాడలో
పాలాభిషేకం

నేటి సాక్షి, నారాయణపేట,జూన్ 24,,

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర మంత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం

ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ తూచా తప్పకుండా అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర మంత్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా రైతు భరోసా నిధులు రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసి రైతన్నల మన్ననలను పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి, తొమ్మిది రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు 9 వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాలో రైతు భరోసా నగదును జమ చేసింది.. అంటే ఇప్పటివరకు రూ, 1 కోటి 49 లక్షల 39 వేల 111 ఎకరాలకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే దక్కుతుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే తెలంగాణ మంత్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు లోక్ సభ పక్షనేత శ్రీ రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికా రెడ్డి గారి కి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన ప్రత్యేకమైన అభినందనలు మరియు ధన్యవాదాలు తెలుపుతూ టపాసులు పేల్చి పాలాభిషేకం చేశారు. దన్వాడ మండల కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News