నేటి సాక్షి : ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్)మిగులు రెవిన్యూ బడ్జెట్ తో వున్న తెలంగాణ రాష్ట్రాని తమ స్వార్ధ ప్రయోజనాలకొరకు,అవినీతి అనాలోచిత అహంకార దోపిడి నిర్ణయాలతో ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాలా తీయించి కుంచిత భావాలతో అసత్య ఆరోపణలతో ప్రజలను నమ్మించి తమ ఉనికిని కాపాడుకోవాలని పేక్ పేడ్ ఆర్టిస్ట్ లతో అవాస్తవాలను ప్రచారం చేయిస్తూ రైతులను రెచ్చగొట్టి లబ్ధిపొందకుండా కుట్రలకు తెరలేపిన ప్రతిపక్ష పార్టీలు మఖ్యంగా బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న అసత్య నమొద్దు అని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి అన్నారు. బుధవారం విలేఖరులకు అందజేసిన ఒక ప్రకటనలో పాండురంగా రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల ఆర్థిక శ్రేయస్సు కోసం ‘రైతు భరోసా’ పథకం ద్వారా మరో ముందడుగు వేసింది. మూడు ఎకరాల వరకు భూమి కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ పథకం నిధులను జమ చేయబడింది ఈ సందర్భంగా రూ.1,551.89 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులు రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు వ్యవసాయ రంగంలో స్థిరత్వాన్ని తీసుకొస్తాయి అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 16తారీఖున ప్రారంవిన రైతు భరోసా డబ్బులు రైతులందరి ఖాతాల్లో రానున్న 25 తేది వరకు రైతు భరోసా డబ్బులు జమ అవుతాయి అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బటన్ నొక్కగానే రైతుల ఖాతాల్లో భరోసా నిధులు టింగ్ టింగ్ మంటూ జమవుతున్నాయని అన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం ఒక చరిత్రాత్మక నిర్ణయం అని కొనియాడారు. రాష్ట్రంలో సాగులో ఉన్న 1.49 కోట్ల పైబడి ఎకరాలకు నిధులు ప్రజా ప్రభుత్వం జమచేస్తుందని అన్నారు.

