Thursday, January 22, 2026

రైతు భరోసా పై సంబరాలు

పేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సూర్య మోహన్ రెడ్డి నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 24,నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోని స్థానిక ఇందిరా గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ మరియు రైతుల ఆధ్వర్యంలో రైతు భరోసాపై అంబరాన్నంటిన సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సూర్య మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ,ప్రజా ప్రభుత్వం ,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏదైతే హామీలు ఇచ్చారో, ఆ హామీలన్నీ తుచ తప్పకుండా అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర మంత్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రైతు భరోసా నిధులు రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేసి రైతన్నల దీవెనలను పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి, 9 రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో నగదు జమ చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తు రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. రైతన్నలు మాట్లాడుతూ వర్షాకాల పంటలకు పెట్టుబడి సహాయంగా రైతు భరోసా పథకం కింద మన తెలంగాణ ప్రజా ప్రభుత్వం 9వేయిల కోట్ల రూపాయల నగదు జమ చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేస్తు,రానున్న రోజులలో ప్రజా ప్రభుత్వానికి , కాంగ్రెస్ పార్టీ కి ఎల్లప్పుడూ మద్దతుగా వుంటామని రైతులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ,మండల నాయకులు, కార్య గొల్ల కృష్ణయ్య, మరికల్ మండల అధ్యక్షులు వీరన్న, మాజీ ఎంపిటిసి సీమ గోపాల్, నాయకులు మరికల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరీష్ కుమార్, నాయకులు గోవర్ధన్ జనార్ధన్,పి. నారాయణ, రాఘవేంద్ర, కృష్ణారెడ్డి, ఎన్ ఎస్ సి వై నాయకులు అన్వర్ సాదాత్, చెన్నయ్య, పెంట మీద సత్తన్న,రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News