నేటి సాక్షి – జగిత్యాల జిల్లా స్టాఫర్
( గుండ ప్రశాంత్ గౌడ్ )
జగిత్యాల, జూన్ 04: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని బొంకూర్ గ్రామంలో నేడు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. మే 5 నుండి జూన్ 18, 2025 వరకు కొనసాగే ఈ కార్యక్రమం వ్యవసాయ శాస్త్రవేత్తలకు మరియు రైతులకు మధ్య ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తోంది స్థిరమైన వ్యవసాయ పద్ధతులు నేల ఆరోగ్య నిర్వహణ పంట మార్పిడి యూరియా యొక్క సరైన వినియోగం వ్యవసాయంలో నీటి యాజమాన్యం వంటి కీలక అంశాలపై రైతులకు అవగాహన కల్పించడం మరియు వారి సందేహాలను నివృత్తి చేయడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం.వ్యవసాయ కళాశాల సహాయ ఆచార్యులు డా. ప్రజ్ఞ ఈ సందర్భంగా మాట్లాడుతూ యూరియా వాడకాన్ని మోతాదుకు మించి వాడకూడదని రైతులకి సూచించారు. అలాగే పంట నష్ట పరిహారం మరియు పంట మార్పిడి గురించి రైతులకు అవగాహన కల్పించారు. డాక్టర్ పి. అరుణ్ కుమార్ సహాయ అధ్యాపకులు మాట్లాడుతూ రైతులు నాణ్యమైన విత్తనాలను ఉపయోగించి అధిక దిగుబడులు సాధించవచ్చని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఏఈఓ సంధ్య మరియు చుట్టుపక్కల గ్రామాల రైతులు పాల్గొన్నారు. శాస్త్రవేత్తలు రైతులకు వివిధ వ్యవసాయ పద్ధతులపై వివరణాత్మకమైన సమాచారం అందించారు మరియు వారి ప్రశ్నలకు ఓపికగా సమాధానమిచ్చారు రైతులు తమ అనుభవాలను సమస్యలను శాస్త్రవేత్తలతో పంచుకున్నారు.ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, దీని ద్వారా వారు నూతన వ్యవసాయ పద్ధతులను తెలుసుకొని తమ దిగుబడులను పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.

