నేటి సాక్షి రామడుగు (పురాణం సంపత్)
రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినందుకు గాను మంగళవారం రామడుగు మండలంలోని అన్ని రైతు వేదికల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తో రైతులు ముఖాముఖి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మండలంలో 13,671 మంది రైతులకు నిధులను వారి ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.





