Monday, March 16, 2026

*రైస్ మిల్లుల్లో ‘రహస్య’ తనిఖీల మర్మమేంటో.!?*————-* ‘ఆ-మూడు’ రైస్ మిల్లులపై విజిలెన్స్-ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల దాడులు.?* ‘రూ.కోట్ల ధాన్యం-గల్లంతు’పై ఫిర్యాదుల ప్రభావమేనా.?* గతంలోనూ ‘రహస్య తనిఖీలే’..ఇప్పుడూ ‘గుట్టుచప్పుడు’ కాని దాడులే.? ఎందుకని.?* ‘అధికారులూ-రైస్ మిల్లుల యజమానుల’ కుమ్మక్కు కోసమే కావొచ్చన్న ఆరోపణలు * ‘వివరణ’ కోరిన ‘నేటి సాక్షి’పై ‘డిసిఎస్ఓ’ ఫైర్ ————————–*

నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్లకు చెందిన బడా వ్యాపారులకి చెందిన మూడు రైస్ మిల్లుల్లో మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 6-7 వాహనాల్లో వచ్చి ‘రహస్యంగా’ తనిఖీలు నిర్వహించినట్టు స్థానికంగా చర్చనీయాంశమైంది.ఈ దాడుల విషయం బయటకు పొక్కకుండా ‘రహస్యంగా’ ఉంచేసి..ప్రెస్ కు వివరాలు వెల్లడించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇదే విషయంపై జగిత్యాల డిసిఎస్ఓ జితెందర్ రెడ్డిని ‘నేటి సాక్షి’ వివరణ కోరగా ‘వివరాలు’ ఇవ్వకుండా ‘విజిలెన్స్’ అధికారులపై నెపంపెట్టి ఫైరయ్యారు.దీంతో ప్రజల అనుమానాలకు బలం చేకూరినట్టైంది.!*ఇంతకూ ఈ తనిఖీలు ఎక్కడ .?*కోరుట్ల పట్టణంలోని ఓ పెద్ద రైస్ మిల్లుతో పాటు..కథలాపూర్ మండలంలోని సిరికొండలో మరో రెండు రైస్ మిల్లుల్లో విజిలెన్స్ అధికారులతోపాటు.. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా 6-7 వాహనాల్లో వచ్చి దాడులు చేసినట్టు సంబంధిత వ్యాపార వర్గాల్లో చర్చానీయాంశమైంది.తొలుత నూతనంగా నిర్మించిన రైస్ మిల్లుల్లో తనిఖీలతోపాటు.. జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు ‘రైస్ మిల్లుల్లో’ జరుగుతున్న ‘అవినీతి దందా’పై బిజెపి కిసాన్ మోర్చ రాష్ట్ర నాయకులు ‘ఆకుల రంజిత్’ ఫిర్యాదు చేసిన రైస్ మిల్లులో కూడా తనిఖీలు నిర్వహించినట్టు సమాచారం.*కోట్ల రూపాయల ధాన్యం గల్లంతు నిజమేనా.?*ఇటీవల రైస్ మిల్లుల్లో రూ.70-80 కోట్ల ధాన్యం గల్లంతైనట్టు కోరుట్ల ‘బియ్యం వ్యాపార’ వర్గాల్లో గుప్పుమంది.ఇదే క్రమంలో ‘ఓ-రేషన్ బియ్యం లారీ’ గల్లంతు వ్యవహారం కూడా తీవ్ర చర్చానీయాంశమైంది.కోరుట్ల రైస్ మిల్లుల్లోనే గాక.. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా చాలా రైస్ మిల్లుల్లో వందల కోట్ల విలువైన ధాన్యం గల్లంతైందని..ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ నుంచి మొదలుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు సంబంధిత శాఖాధికారులందరికీ ‘ఆకుల రంజిత్’ ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన అధికారులు విచారణ చేపట్టినట్టు సమాచారం.తొలుత కోరుట్ల నుంచి దాడులు చేసి వివరాల కూపీ లాగుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.*ఇంత రాత్రి ఫోన్ చేస్తే.. వివరాలు చెప్పాల్నా.!?*( జగిత్యాల డిసిఎస్ఓ జితెందర్ రెడ్డి )కోట్ల రూపాయల విలువైన ధాన్యం డబ్బులు కొల్లగొట్టిన రైస్ మిల్లుల్లో మంగళవారం అధికారులు ‘మెరుపు దాడులు’ చేశారటన్న సమాచారం అందుకున్న ‘నేటి సాక్షి’ సమగ్ర వివరాల కోసం జగిత్యాల జిల్లా డిసిఎస్ఓ జితెందర్ రెడ్డిని ‘వివరణ’ కోరింది.దానికి ఆయన ఒక్కసారిగా ‘బీపీ’ పెంచుకుని ఇంత రాత్రి ఫోన్ చేసి వివరాలు అడిగితే ఇవ్వాలా.?(అప్పుడు టైం రాత్రి 8-40) అంటూ ఫైరయ్యారు. మీరు దాడులు చేసిన విషయం తెలిసింది.! అధికారిక సమాచారం కోసం మిమ్మల్ని సంప్రదించాం..ఐనా ‘ప్రెస్’కు రిలీజ్ చేయలేదు కదా.? మిమ్మల్ని అడిగింది వివరాలే కదా.? ఎప్పుడైనా ‘ప్రెస్ వాళ్లు’ అడగొచ్చు అంటే..దానికాయన విసుక్కుంటూ.. వెటకారంగా.. సరే! సార్.. మీరు అర్థరాత్రి 12 గంటలకు ఫోన్ చేసి అడిగినా వివరాలు ఇస్తాం..సరేనా.? దాడులు చేసిన ‘విజిలెన్స్’ అధికారులు ఇంకా మాకు రిపోర్ట్ ఇవ్వలేదు ..వాళ్లు ఇచ్చినంక చెప్తామని అర్థాంతరంగా ఫోన్ కాల్ కట్ చేసేశారు.! *రైస్ మిల్లుల్లో అసలేం జరుగుతోంది?*జగిత్యాల జిల్లాలో 100 కు పైగా రైస్ మిల్లులుండగా.. ఇందులో చాలా రైస్ మిల్లుల్లో ‘గోల్ మాల్’ జరుగుతున్నట్టు దుమారం రేగుతోంది.రైస్ మిల్లుల యజమానులు ‘అక్రమ రేషన్ బియ్యం’ దందా ‘డీలర్ల’తో కుమ్మక్కై గుట్టుచప్పుడు కాకుండా యధేచ్ఛగా నడిపిస్తున్నారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.అదేవిధంగా ప్రభుత్వానికి ధాన్యం పెండింగ్ బకాయిల యవ్వారం కూడా శృతిమించిందన్న ఆరోపణలున్నాయి.’సివిల్ సప్లై అధికారులు – రైస్ మిల్లర్ల యజమానులకు’ మధ్య రహస్య ఒప్పందాలేవో ఉన్నాయి కాబట్టే ఏ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారని చర్చించుకుంటున్నారు.ఇప్పుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో జరిగిన ‘విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్’ అధికారుల దాడుల వ్యవహారం ‘ప్రెస్’కు వెల్లడించకపోవడం.. వివరాలు అడిగిన ‘నేటి సాక్షి’పై ‘డిసిఎస్ఓ’ ఫైర్ కావడంపై ప్రజలు చర్చించుకుంటున్న అనుమానాలకు బలం చేకూరినట్టైంది.!______

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News