నారాయణపేట భీష్మ ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి….
పేట ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ను కలిసిన భీష్మరాజ్ ఫౌండేషన్ బృందం….
ఆసుపత్రికి కుర్చీలు అందజేయాలని కోరిన అధికారి…సానుకూలంగా స్పందన….
నేటి సాక్షి,నారాయణపేట, జిల్లా, 7,
నారాయణపేట పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని అక్కడి నుండి అప్పక్ పల్లి నూతన భవనంలోకి ఇటీవల మార్చారు. ఆసుపత్రి మార్పుతో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై అప్పక్ పల్లిలోని నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆదిత్య గౌడ్ ను వారి కార్యాలయంలో భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులతో కలిసి చర్చించారు. ఆసుపత్రి తరలించడం వల్ల రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఆదిత్య గౌడ్ స్పందిస్తూ.. ఆసుపత్రిలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని తెలిపారు. ఆసుపత్రికి ప్రతి 15 నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సు నడుస్తుందని వివరించారు. ఆసుపత్రికి రోగుల వెంట వచ్చేవారు కూర్చునేందుకు కుర్చీలు లేవని, భీష్మరాజ్ ఫౌండేషన్ తరుపున కుర్చీలను అందజేయాలని కోరగా, అందుకు రాజ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే కుర్చీలను అందజేస్తామని హామీనిచ్చారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ను కలిసిన వారిలో ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, మధుసూదన్ రెడ్డి, హన్మంతు ముదిరాజ్, నర్సింహనాయుడు, శివరాజ్, ఎం.సంతోష్, మన్నె గోపాల్, వై.సంతోష్, నందుకుమార్, ఆశోక్, శ్రీనివాస్, నాగురావు, నర్సింహ, కృష్ణ యాదవ్, రాజు, రాము తదితరులు ఉన్నారు.