నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 03 ~అన్నమయ్య జిల్లా :-: మదనపల్లి పట్టణంలోని చిత్తూరు బస్టాండ్ వద్ద చెంబకూరు రోడ్డు లో గల డైలీ మార్కెట్ ఎదురుగా నూతనంగా వేసిన రోడ్డుపై స్థానిక ప్రజలు నడవలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి సంబంధిత కాంట్రాక్టర్ లేక అధికారుల నిర్లక్ష్యమో తెలియదు కానీ స్థానిక ప్రజలైతే నరక యాతన అనుభవిస్తున్నారు. బుధవారం స్థానిక ప్రజలు ఫిర్యాదు మేరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ ఆ ప్రాంతానికి వెళ్లి రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టర్, సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తా ఉంది. సిమెంటు రోడ్డు వేసి క్యూరింగ్ చేసిన తరువాత బంకమట్టినీ రోడ్డుపై వదిలేయడంతో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు క్యూరింగ్ చేస్తున్న నీళ్లు సమమై రోడ్డంతా చిందర వందరగా తయారైంది. రోడ్డు వేసిన తర్వాత మట్టిని తొలగించాల్సింది పోయి అలాగే వదిలేసినా కాంట్రాక్టర్ పైన మరియు అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. మరికొద్ది రోజుల్లో మదనపల్లి జిల్లా కాబోతుంది. కానీ మదనపల్లి పట్టణంలో పలు సమస్యలు నెలకొన్నాయి. వీటిపై చర్యలు తీసుకోరానని మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిసార్ అహమ్మద్ ప్రశ్నించారు. బుధవారం చిత్తూరు బస్టాండు సమీపంలో చెంబకురు వెళ్ళే రహదారిలో డైలీ మార్కెట్ సమీపంలో స్దానిక ప్రజలు నిస్సార్ అహమ్మద్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి రోడ్డును పరిశీలించారు. స్థానిక ప్రజలు వాపోతూ గత రెండు నెలలుగా స్థానిక ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నామని సంబంధిత అధికారులకు విన్నవించుకున్న ఏ ఒక్క అధికారి కూడా స్పందించలేదని స్దానికులు వాపోయారు. నిత్యం అత్యంత రద్దీగా ఉండే దారిలో కాంట్రాక్టర్ నిర్వహకంపై స్థానిక ప్రజలు మండిపడ్డారు. సిమెంట్ రోడ్డ వేసి అనంతరం క్యూరింగ్ కోసం వేసిన బంక మట్టినీ తొలగించకపోవడం తో ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఇలా రోడ్డు పక్కకు తోసేయడంతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందిని స్వయంగా చూడటం జరిగిందని నిస్సార్ అహ్మద్ అన్నారు. మట్టిని తొలగించాల్సిన కాంట్రాక్టర్ పక్కకు వేసి వెళ్ళిపోయాడని, సంబంధించిన శాఖ అధికారులు తొలగించడానికి సరైన చర్యలు చేపట్టలేదని గత పది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో ఈ రోడ్డుపై నడవాలంటేనే ప్రజలు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి మట్టిని తొలగించాలని నిస్సార్ అహ్మద్ కోరారు. గతంలో సైతం చిత్తూరు బస్టాండు సర్కిల్ నుంచి ఆర్ అండ్ బి కి వెళ్ళే దారిలో సైతం సిమెంట్ రోడ్డు వేసిన సందర్భంలో ఇలాగే చేశారని గుర్తు చేశారు. అధికార యంత్రాంగం సరైన చర్యలు తీసుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు..~~~~~~~~~~~~~~~~~~





