Friday, March 6, 2026

రోడ్డు నిర్మాణంలో జాప్యం ఎందుకు..?

నేటి సాక్షి,వేమనపల్లి: నీల్వాయి ప్రధాన రోడ్డు నిర్మాణంలో జాప్యం ఎందుకు జరుగుతుందని బిజెపి మండల అధ్యక్షులు ఏట మధుకర్ ఆరోపించారు.బిజెపి తరుపున నిరసన కార్యక్రమం చేపట్టారు.వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మంజూరు అయిన డబుల్ రోడ్డు నిర్మాణం అధికారుల,ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో రోడ్డు మంజూరు అయినప్పటికీ రోడ్డును పూర్తి చేయకపోవడం విడ్డూరంగా ఉందని ఈ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నట్లు,గతంలో బిజెపి తరుపున నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో గుత్తేదారు కొత్తగూడెం నుండి నీల్వాయి వరకు పూర్తి చేశారు.తిరిగి నీల్వాయి గ్రామంలో డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉండగా సింగిల్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు.రోడ్డును కాస్త తీసివేసి ఎర్రమట్టి పోయడంతో వర్షం కొడితే బురదమయం కావడంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి అలాగే సింగిల్ రోడ్డు నిర్మాణం చేపడితే వాహనాలు ఎదురెదురుగా వస్తే వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకుంది.ఇప్పటికైనా అధికారులు స్పందించి నీల్వాయి గ్రామంలో రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని బిజెపి తరుపున డిమాండ్ చేస్తునామని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షులు కంపెల అజయ్ కుమార్,నాయకులు కొప్పుల చరణ్,కోయిల స్వామి,నవునూరి రమేష్ గౌడ్,సీపెల్లి ప్రశాంత్,కొత్తూరి పోచయ్య,జిల్లపెల్లి రవి,తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News