నేటి సాక్షి, వాంకిడి : వాంకిడి మండల కేంద్రంలో నాలుగు వరుసల రహదారిని డీబీఎల్ కంపెనీ ఇష్టారాజ్యంగా నిర్మించడంతో మూగజీవాలకు శాపంగా పరిణమిస్తున్నది. పైకప్పులు సరిగా వేయకపోవడంతో పదుల సంఖ్యలో మూగజీవాలు అందుపడి, విలవిలల్లాడుతున్నాయి. తాజాగా మంగళవారం మురికి కాలువలో ఉదయం గేదె ప్రమాదవశాత్తూ పడింది. గమనించిన స్థానికులు దానిని బయటకు తీసి, ప్రాణాలు కాపాడారు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా చోట్ల రోడ్ల మీద మురికి కాలువలు నిర్మించకపోవడంతో చిన్నపాటి వర్షానికి హనుమాన్ మందిర్ వెళ్లే దారిలో వర్షపు నీరు దుకాణాల్లో చేరుతున్నాయి. దీంతో షాపుల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి, కాలువలు సరిగా నిర్మించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు, దుకాణాదారులు కోరుతున్నారు.

