నేటి సాక్షి,నారాయణపేట, డిసెంబర్ 25, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోని శ్రీ మణికంఠ జూనియర్ కళాశాల విద్యార్థులు గురువారం నాడు విహారయాత్రకు తరలి వెళ్లారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జాతీయ రహదారి పై బాలానగర్ వద్ద స్కూల్ బస్సు బోల్తా పడింది. ఇదే సమయంలో వనపర్తి పర్యటన కు వెళ్తున్న రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తన కాన్వాయ్ ను ఆపి బస్సు దగ్గరికి వెళ్లారు. ప్రమాద స్థలం లో ఆక్సిడెంట్ అయిన కారు ను మంత్రి స్వయంగా పక్కకు తోశారు. బోల్తా పడ్డ బస్సును క్రేన్ సాహాయంతో పక్కకు తీయించారు. హైదరాబాద్ వెళ్లే రహదారి పై భారీగా ట్రాఫిక్ జాం కావడం తో మంత్రి స్వయంగా ట్రాఫిక్ నిక్లియర్ చేశారు. గాయపడ్డ విద్యార్థుల దగ్గరికి వెళ్లి వారిని పరామర్శించారు. ప్రమాదానికి గురై భయ బ్రాంతులకు లోనైన విద్యార్థులకు మంత్రి ధైర్యంచెప్పారు. ఈ ప్రమాదం లో గాయపడ్డ విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని షాద్ నగర్ డాక్టర్ లకు ఫోన్ చేసి చెప్పారు. విద్యార్థులకు దగ్గరుండి అన్ని చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రి స్వయంగా ట్రాఫిక్ క్లియర్ చేసి విద్యార్థులకు ధైర్యాన్ని ఇవ్వడంతో అటుగా వెళుతున్న ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.





