బావిలో దూకి తండ్రి ఆత్మహత్య..
రెండున్నర ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి..
రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కూతురు ఆరోగ్య పరిస్థితి ఆందోళన..
గ్రామంలో విషాదఛాయలు..
నేటి సాక్షి పాలేరు , జూన్ 30 :
దురదృష్ట వశాత్తూ జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఇప్పుడు ఆ కుటుంబ విషాద గాథ పలువురినీ కంట తడి పెట్టిస్తుంది.. రెండేళ్ల క్రితం 365 బిబి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం వారి కుటుంబానికి పెద్ద శాపంగా మారి నిండు ప్రాణాలను బలికొన్నది.. వివరాలు ఇలా ఉన్నాయి.. కూసుమంచి మండలం ధర్మతండ గ్రామానికి చెందిన జర్పుల పరశురాం(35) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.. కొంత కాలం క్రితం కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం , అదే రోడ్డు ప్రమాదంలో కూతురుకి తీవ్రంగా గాయాలు అయ్యాయి.. వెరసి తాహతుకు మించి అప్పులు చేయడం.. కూతురు ఆరోగ్యంపై ఆందోళనతో ఉన్న పరశురాం ఆదివారం రాత్రి సమయంలో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు .. మృతునికి భార్య, ఒక కొడుకు, కూతురు ఉండగా.. రెండున్నర ఏళ్ళక్రితం ఖమ్మం పట్టణంలో ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి తిరిగి వస్తుండగా జీళ్ళచెరువు గ్రామ సమీపాన జాతీయ రహదారిపై కారు ,బైక్ ఢీకొన్న ఘటనలో పరశురాం కొడుకు అక్కడికి అక్కడే మృతి చెందగా ,కూతురు తీవ్రగాయాలపాలై పరిస్థితి విషయంగా ఉండడంతో చికిత్స నిమిత్తం హైద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ కి తరలించారు.. అప్పటి నుండి కూతురు వైద్య ఖర్చులకు 30 లక్షలకు పైగా అయ్యాయి.. విషయం తెలుసుకున్న అనేక మంది దాతలు సహాయం చేసినప్పటికి ఇంకా కూతురు ఆరోగ్యం కుదుటపడకపోవడం ప్రతి నెల 50 వేల వరకు వైద్యానికి ఖర్చు అవ్వడం మరోవైపు అప్పుల బాధలు ఎక్కువవడంతో ఆదివారం మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. పరశురాం మరణ వార్తతో సొంత ఊరులో విషాద ఛాయలు అలుముకున్నాయి.. మండల ప్రజలు వారికి కుటుంబ గాధను సోషల్ మీడియాలో చర్చించుకుంటూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.. ఏదైనా ఒక కుటుంబం రోడ్డుమీద పడింది..
ప్రభుత్వంమే ఆదుకోవాలని .
బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన జర్పుల పరశురాం కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.. అసలుకే నిరుపేద కుటుంబం రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబంలో ఇంటి పెద్ద దిక్కుగా ఉన్న పరశురాం ఆత్మహత్యతో భార్య ,కూతురు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.. మరోవైపు మృతుని కూతురు ఆరోగ్యం పరిస్థితి ఆందోళనగానే ఉండడం వైద్య ఖర్చులకు రూపాయ లేని పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వం స్పందించి వారి కుటుంబానికి అండగా నిలబడాలని కోరుతున్నారు..





