నేటి సాక్షి కోదాడ (అనంతగిరి) సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల కేంద్రంలో సూర్యాపేట జిల్లా పోలీసు వారు నిర్వహిస్తున్న రోడ్డు భద్రత మహా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా అనంతగిరి పోలీసులు వాన దారులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎస్సై నవీన్ కుమార్ మాట్లాడుతూ వాహనదారులకు రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్ సమయంలో ప్రమాదం జరిగిన వారికి స్వచ్ఛందంగా ప్రజలు సహాయపడితే 25000 రూపాయలు ప్రభుత్వం పారితోషికం అందజేస్తుందని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి సహాయపడితే కేసులు నమోదైతాయని అపోహలు వదిలివేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి బాటసారులు సహాయపడి ప్రాణాలు కాపాడాలని తెలియజేశారు.





