Tuesday, March 17, 2026

రోడ్డు భద్రత…ప్రతి ఒక్కరి బాధ్యత-రోడ్డు ప్రమాదాల స్పాట్లను గుర్తించి…వెంటనే నివారణ చర్యలు చేపట్టండి-జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

నేటిసాక్షి, నల్లగొండ : రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రోడ్డు భద్రత జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ఇటీవల కాలంలో వివిధ కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయని, దీనివల్ల మనుషుల ప్రాణాలు పోయి కుటుంబాలు వీధిన పడుతున్నాయి, రోడ్డు ప్రమాదాలను నివారించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. మానవ తప్పిదాల వల్ల రొడ్డు ప్రామాదాలు జరగకుండా చూడాలని, ఇందుకు వివిధ శాఖలు సమన్వయంతో వ్యక్తిగత శ్రద్ధ వహించి, పని చేయాలని, రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రదేశాలను గుర్తించి, ఇకపై అక్కడ ప్రమాదాలు సంభవించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, ప్రత్యేకించి పోలీస్ శాఖ గుర్తించిన బ్లాక్ స్పాట్లు, సూచించిన ప్రదేశాలలో ప్రమాదాల నివారణకు ఆర్ అండ్ బి,నేషనల్ హైవే, అలాగే ఇతర శాఖలు పూర్తి సహకారం అందించి ప్రమాదాలను నివారించేందుకు సహకరించాలి, స్కూల్ బస్సుల వల్ల ప్రమాదాలు జరగకుండా ప్రతి స్కూలు వాహనానికి సైడ్ మిర్రర్లు ఏర్పాటు చేయడమే కాకుండా, బస్సులో సహాయకున్ని తప్పనిసరిగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని వారి నుండి ఇండెమినెట్ బాండును తప్పనిసరిగా తీసుకోవాలి ఆదేశించారు. ఆర్టీసీ బస్సుల ద్వారా యాక్సిడెంట్లు జరగకుండా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టాలని, ప్రమాదాలను నివారించేందుకు అన్ని వాహనాలకు రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇటీవల వర్షాల వల్ల చిట్యాల అండర్ పాస్ వద్ద నీరు నిలిచిపోయి ట్రాఫిక్ ఏర్పడటం జరిగిందని, ఈ విషయంపై ఇరిగేషన్, నేషనల్ హై వే, ఆర్ అండ్ బి తదితర శాఖలు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇదే సమస్య ఇనుపాముల వద్ద కూడా గుర్తించడం జరిగిందని, పోలీసు అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, దానిపై కూడా తక్షణం స్పందించాలని ఆదేశించారు. మర్రిగూడా బైపాస్ వద్ద రోడ్డుపై గుంతలు పడినందున మొరం వేయించారని అన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ శరాత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, జిల్లాకు సంబంధించిన వివిధ రహదారులపై ప్రమాదాలు జరిగే ప్రదేశాలను పోలీసు శాఖ ఎప్పటికప్పుడు గుర్తించి, సంబంధిత శాఖ అధికారులకు అధికారికంగా తెలియజేయడం జరుగుతున్నదని, వీటన్నిటినిపై తక్షణమే స్పందించి, ప్రమాదాలు నివారించాలని, చిట్యాల అండర్ పాస్ వద్ద వర్షపు నీరు నిలిచిపోవడం వల్ల నాలుగైదు రోజులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరిగిందని, దీనికి శాశ్వత పరిష్కారం కనుక్కోవాలని జిల్లా కలెక్టర్ తో కోరారు. సర్వీస్ రోడ్లు లేకుండా పెట్రోల్ బంకులు నిర్వహిస్తున్న వారికి నోటీసులు జారీ చేసి, సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రత్యేకించి ఆర్ అండ్ బి, జాతీయ రహదారుల భద్రతపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, నల్గొండ పట్టణంలో క్లాక్ టవర్, వైఎస్ఆర్ చౌరస్తా తదితర చౌరస్తాలలో లైటింగ్, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ తో కోరారు. ఈ సమావేశంలో జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, ఆర్ అండ్ బి ఈ ఈ శ్రీధర్ రెడ్డి, ఆర్ఎమ్ ఆర్టిసి. కె. జానీ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్, డీఎస్పీ శివరాం రెడ్డి, పోలీస్ అధికారులు, తదితరులు హాజరయ్యారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News