Tuesday, March 10, 2026

రోడ్ల మీదే సభలువాహనదారులకు తప్పని అవస్థలుపట్టింపు లేని అధికారులు

నేటిసాక్షి, కరీంనగర్:అల్గునూరు ప్రధాన కూడలి. నిత్యం వేలాది ద్విచక్ర వాహనాల నుంచి మొదలుకొంటే భారీ వాహనాలు ఈ కూడలి మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. ఉమ్మడి జిల్లాలోని అత్యంత రద్దీగా ఉండే ప్రధాన రహదారి కూడలి ఇది. ఓవైపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు వెళ్లే రాజీవ్ రహదారి.. మరోవైపు వరంగల్ వైపు వెళ్లే జాతీయ రహదారి.. సాధారణంగానే తరుచూ చిన్నపాటి నుంచి భారీ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇంతటి రద్దీ కూడలి అల్గునూరు వద్ద ప్రధాన రహదారిపైనే ఆదివారం కాంగ్రెస్ పార్టీ టెంట్లు వేసి సభ నిర్వహించడం విమర్శలకు తావిచ్చింది. వాహనదారులు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ ప్రమాదం జరిగి ఉండేది. అధికార పార్టీ అనే అహంకారమా? ఏం చేసినా చెల్లుతుందనే లెక్కలేనితనమా? అనే విషయం చర్చనీయాంశమైంది. ప్రధాన రహదారిని ఆక్రమించి వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం గర్హనీయం.ప్రధాన రహదారిపై సభలా?సుగుర్తి జగదీశ్వరాచారి, బీజేపీ మండలాధ్యక్షుడునిత్యం రద్దీగా ఉండే అల్గునూరు కూడలిలో రోడ్డుపైనే సభలు ఏర్పాటుచేయడం సబబు కాదు. చిన్నచిన్న విషయాలకే సాధారణ ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురిచేసే యంత్రాంగం రోడ్డు మీదే సభలు నిర్వహిస్తున్నప్పటికీ పట్టించుకోకపోవడం శోచనీయం. అనుమతి ఉన్నట్టుంది!?సదన్‌కుమార్, ఎలఎండీ సీఐఅల్గునూరులోని ప్రధాన రహదారిపై ఏర్పాటుచేసిన సభకు అనుమతి విషయమై ఎలఎండీ సీఐని సంప్రదించగా, అనుమతి ఉన్నట్టుందని, ఎస్సైకి మాట్లాడుతానని తెలిపారు. రోడ్డు మీద సభ పెట్టడానికి లేదంటూనే నర్మగర్భంగా సమాధానమిచ్చారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News