నేటి సాక్షి,బాపట్ల జిల్లా (పిట్టల వాని పాలెం)బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమా మహేశ్వరరావు ఉత్తర్వుల ప్రకారం డి ఎస్ పి రామాంజనేయులు ఆదేశాల మేరకు బాపట్ల రూరల్ సర్కిల్ సీ ఐ బి హరికృష్ణ నేతృత్వంలో పిట్టలవాని మండలం చందోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని చందోలు బాపట్ల హైవే పై ఎస్ ఐ మర్రి వెంకట శివకుమార్ వాహనాలు తనిఖీ నిర్వహించారు. హెల్మెట్,వాహన ధ్రువ పత్రాలు, లైసెన్స్ లు లేని వాహన దారులకు చలానా విధించారు. జిల్లా ఎస్ పి ఉమా మహేశ్వరరావు బాపట్ల ఎస్ పి గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి రోడ్ ప్రమాదాల నివారణ చర్యలు చేపడుతున్నారని రోడ్ ప్రమాదాల నివారణే లక్ష్యం గా ఆయన ఉత్తర్వులు జారి చేస్తున్నారని, అందరూ కూడా బాధ్యత గా వ్యవహరించి రోడ్ భద్రతా నియమాలు పాటించి రోడ్ ప్రమాదాలు జరగకుండా ఉండేలా చూడాలని ఎస్ ఐ మర్రి వెంకట శివకుమార్ వాహన దారులను కోరారు. రోడ్ ప్రమాదాల నివారణకై పోలీస్ యంత్రాంగం ,ప్రజలలో అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతునప్పటికీ ఎవరు బాధ్యత గా వ్యవహరించడం లేదని ,ఇక పై రోడ్ భద్రతా నియమాలను ఉల్లంఘించిన వారి పై కఠినం గా చర్యలు తీసుకుంటామని ఎస్ ఐ మర్రి వెంకట శివకుమార్ అన్నారు . వాహనదారులు హెల్మెట్ , సీట్ బెల్ట్ ధరించడం వలన ప్రమాదాల సంభవించినప్పుడు ప్రాణాపాయం నుండి బయట పడవచ్చని , ఎస్ ఐ మర్రి వెంకట శివకుమార్ తెలిపారు. ఈ విషయాలు దృష్టి లో పెట్టుకొని వాహన దారులు బాధ్యత నడుచుకోవాలని రోడ్ భద్రతా నియమాలు పాటించి రోడ్ ప్రమాదాల నివారణకై పోలీస్ వారికి సహకరించాలని కోరారు. కార్యక్రమం లో పోలీస్ స్టేషన్ సిబ్బంది, స్వచంద సేవ సంస్థ వారు పాల్గొన్నారు.





