నేటిసాక్షి, నల్లగొండ : జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ర్యాగింగ్ వ్యతిరేక, జిల్లా స్థాయి కమిటీ శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోజిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిజిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ఇటీవల ప్రభుత్వ వైద్య కళాశాలలో సంభవించిన ర్యాగింగ్ సంఘటనలపై చర్చించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సమావేశంలో నిర్ణయించారు. ర్యాగింగ్ కు ఎవ్వరైనా పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ జె.సత్యనారాయణ, ఇన్చార్జి డిఆర్ఓ వై. అశోక్ రెడ్డి, డిఎస్పి శివరాం రెడ్డి, ప్రభుత్వ వైద్య కళాశాల అదనపు ప్రిన్సిపల్ ఆర్ రాధాకృష్ణ, సామాజిక కార్యకర్త సురేస్ గుప్తా, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటింటెంట్ అరుణకుమారి, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, పాల్గొన్నారు.





